ధర్మపురిలో ఘనంగా శరన్నవరాత్రోత్సవాలు

దిశ, ధర్మపురి : పుణ్య క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ శారద దేవి శంకరాచార్య దేవాలయంలో 7వ, తేది నుండి ​ 15వ, తేది వరకు ఘనంగా శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించుతున్నామని దేవాలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరణ చేస్తారు. 7వ, తేదీన అమ్మవారు శైల పుత్రి రూపంలో దర్శన మిస్తుంది. 8 వ, తేదీ బ్రహ్మచారిని, […]

Update: 2021-10-06 04:14 GMT

దిశ, ధర్మపురి : పుణ్య క్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ శారద దేవి శంకరాచార్య దేవాలయంలో 7వ, తేది నుండి ​ 15వ, తేది వరకు ఘనంగా శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించుతున్నామని దేవాలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరణ చేస్తారు. 7వ, తేదీన అమ్మవారు శైల పుత్రి రూపంలో దర్శన మిస్తుంది. 8 వ, తేదీ బ్రహ్మచారిని, 9 తేదీ చంద్రఘంటా దేవి‌గా, 10 తేది కూష్మాండ రూపంలో, 11 వ, తేదీ స్కంద మాత రూపంలో, 12 తేదీ కాత్యాయని రూపంలో , 13 తేదీ కాళరాత్రి‌గా, 14 వ, తేదీ మహాగౌరి అవతారం‌గా దర్శన మిస్తారు, అదే రోజు చంఢీహోమం, బలిహరణ, పర్ణహుతి కార్యక్రమాలు ఉంటాయి. 15 తేది దసర రోజున అమ్మవారు భక్తులకు సిద్దిదాత్రి రూపంలో దర్శన మిస్తారు. నవరాత్రోత్సవాలలో ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలను చేపడుతామని నవరాత్రోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు.

Tags:    

Similar News