ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దు : శ్రీహిత
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా విపత్కర పరిస్థితులలో పాలమూరు పట్టణంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని, అందుకు తగిన సదుపాయాలు తాము కల్పిస్తున్నామని శాంతానారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీయుత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న వారి సహాయకులు, వైద్యం కోసం వచ్చిన ఇతరులకు ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజన సౌకర్యాన్ని కల్పించారు. వీరితో పాటు కరోనా కారణంగా తిండికి నోచుకోలేని అభాగ్యులకు, […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా విపత్కర పరిస్థితులలో పాలమూరు పట్టణంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని, అందుకు తగిన సదుపాయాలు తాము కల్పిస్తున్నామని శాంతానారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీయుత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న వారి సహాయకులు, వైద్యం కోసం వచ్చిన ఇతరులకు ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భోజన సౌకర్యాన్ని కల్పించారు. వీరితో పాటు కరోనా కారణంగా తిండికి నోచుకోలేని అభాగ్యులకు, బయటకు వెళ్లి సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్న వారికి ప్రత్యేక వాహనాలలో భోజనం తీసుకెళ్లి సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీహన్స్ గౌడ్, సాయి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.