రెహమాన్ మెచ్చిన యొడెలింగ్ స్టార్
దిశ, వెబ్‌డెస్క్: ఒక పాటను రాగయుక్తంగా పాడాలంటే దానికి శ్రుతి, లయ, గాత్ర ధర్మం అంటూ చాలా ఫార్మాలిటీస్ పాటించాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆ పాట వింటుంటే మనం ఎంజాయ్ చేయగలగాలి. ఇక భారతీయ సంప్రదాయ సంగీతాలైన కర్ణాటిక్, హిందుస్థానీతో పాటు వెస్టర్న్, పాప్ మ్యూజిక్‌కు కూడా విశేషంగా అభిమానులున్నారు. ఈ క్రమంలోనే ‘యొడెలింగ్’ అనే కొత్త సింగింగ్ స్టైల్ పాపులర్ అవుతోంది. కొత్తగా ట్రెండ్ అవుతున్న యొడెలింగ్ అనే సింగింగ్ ప్రక్రియలో గొంతును చాలా […]
దిశ, వెబ్‌డెస్క్: ఒక పాటను రాగయుక్తంగా పాడాలంటే దానికి శ్రుతి, లయ, గాత్ర ధర్మం అంటూ చాలా ఫార్మాలిటీస్ పాటించాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆ పాట వింటుంటే మనం ఎంజాయ్ చేయగలగాలి. ఇక భారతీయ సంప్రదాయ సంగీతాలైన కర్ణాటిక్, హిందుస్థానీతో పాటు వెస్టర్న్, పాప్ మ్యూజిక్‌కు కూడా విశేషంగా అభిమానులున్నారు. ఈ క్రమంలోనే ‘యొడెలింగ్’ అనే కొత్త సింగింగ్ స్టైల్ పాపులర్ అవుతోంది. కొత్తగా ట్రెండ్ అవుతున్న యొడెలింగ్ అనే సింగింగ్ ప్రక్రియలో గొంతును చాలా స్పీడ్‌గా మాడ్యులేట్ చేస్తుండాలి. హై పిచ్ నుంచి లో పిచ్‌కు వేగంగా మారుతూ, సాంగ్‌ను ర్యాప్ చేస్తూ రకరకాల వాయిస్‌లు వినిపిస్తుండాలి. కాగా ఈ తరహా సింగింగ్‌లో ‘వైజాగ్ గర్ల్ షణ్మఖప్రియ’ ప్రియ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ యొడెలింగ్ సెన్సేషన్‌గా మారింది. అంతేకాదు ఆస్కార్ విన్నర్, వరల్డ్ క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ప్రశంసలు సైతం అందుకొని కెరీర్‌లో దూసుకుపోతోంది.
విశాఖపట్నంకు చెందిన షణ్ముఖ ప్రియకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఎంతో ఇష్టం. షణ్ముఖ మూడేళ్ల వయసులోనే అలారం ట్యూన్‌ను హమ్ చేయడాన్ని గమనించిన ఆమె తండ్రి శ్రీనివాస్.. తనకు కర్నాటక క్లాసికల్ సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. స్వతహాగా ఆయన కూడా కళాకారుడే కావడం అందుకు దోహదపడింది. ఈ క్రమంలో శాస్త్రీయ సంగీతంతో పాటు మోడర్న్ మ్యూజిక్ కూడా నేర్చుకున్న షణ్ముఖ.. సంగీతం తన జీవితంలో ఉత్తమమైన విషయమని, అది లేకుండా తనకు రోజు గడవదని చెబుతోంది. తనకు యొడెలింగ్‌పై ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో కూడా చెప్పుకొచ్చింది. మొదటిసారిగా లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ పాడిన అలాంటి పాట ఒకటి విన్నానని తెలిపింది. ఆయన పాడిన ‘జిందగీ ఏక్ సఫర్ హెయ్ సుహానా’ అనే పాట విన్నప్పటి నుంచి తాను యొడెలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు వెల్లడించింది. గాయకులు సాధారణంగా స్వరాన్ని మార్చి పాడేటప్పుడు శ్వాస చాతి నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారని, తాను మాత్రం హెడ్ వాయిస్‌కే ప్రాధాన్యమిస్తానని తెలిపింది.
ఐదేళ్ల నుంచే సింగర్‌గా ప్రదర్శనలు ఇస్తున్న షణ్ముఖ.. తన తండ్రితో కలిసి 2008లో అన్నమాచార్య కీర్తనలు పాడింది. అదే ఏడాది ‘లిటిల్ చాంప్స్’ ద్వారా టీవీ షోస్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2017 ‘సరిగమప’ చాంప్స్‌లో ఆమె పాడిన ‘జాను తు యా జానే నా’ పాట విన్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ ఆమెను అభినందించారు. ‘నెక్స్ట్ జాజ్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని ప్రశంసించారు. ఇక ప్రస్తుతం యొడెలింగ్ సెన్సేషన్‌గా మారిన షణ్ముఖ పర్ఫార్మెన్స్‌కు ఇండియన్ ఐడల్ సీజన్12 జడ్జెస్ కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం విశేషం.
షణ్ముఖ ప్రతిభను తన తండ్రి గుర్తించినప్పటికీ, ఆమె తల్లి రత్నమాల ఆమెకు మెయిన్ సపోర్ట్‌గా నిలిచింది. ఆమెతో షోస్ అన్నిటికీ హాజరై వెన్నుతట్టి ప్రోత్సహించింది. కాగా తనకు టైమ్ కుదిరిన ప్రతిసారి దేవాలయాలు సందర్శిస్తానని, తద్వారా తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్న షణ్ముక.. గానంలోనే కాదు చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. తను ఎక్కడికెళ్లినా తనతోపాటు బుక్స్ తీసుకెళ్తానని, సమయం దొరికినప్పుడు చదవుకుంటానని, సింగింగ్ ప్రొఫెషన్, చదువు రెండిటినీ మెనేజ్ చేస్తానని చెప్పింది.