టవల్‌తో షమి హల్‌చల్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమి సౌతాంప్టన్ స్టేడియంలో టవల్ ధరించి ఫీల్డింగ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ 5వ రోజు న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో షమి తన బౌలింగ్ పూర్తి చేసుకొని బౌండరీ దగ్గరకు వచ్చాడు. అక్కడ వాటర్ తాగిన తర్వాత టవల్ తీసుకొని ముఖం తుడుచుకున్నాడు. ఆ టవల్ తిరిగి రిజర్వ్ ఆటగాడికి ఇవ్వకుండా తానే నడుముకు చుట్టుకున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తుండగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమి సౌతాంప్టన్ స్టేడియంలో టవల్ ధరించి ఫీల్డింగ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ 5వ రోజు న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో షమి తన బౌలింగ్ పూర్తి చేసుకొని బౌండరీ దగ్గరకు వచ్చాడు. అక్కడ వాటర్ తాగిన తర్వాత టవల్ తీసుకొని ముఖం తుడుచుకున్నాడు. ఆ టవల్ తిరిగి రిజర్వ్ ఆటగాడికి ఇవ్వకుండా తానే నడుముకు చుట్టుకున్నాడు.
ఇషాంత్ శర్మ బౌలింగ్ చేస్తుండగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. షమి కాసేపు అలాగే టవల్ చుట్టుకొని ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆ వెనుకే గ్యాలరీలో ఉన్న అమ్మాయిలు కాసేపు నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సౌతాంప్టన్ వాతావరణం చాలా చల్లగా ఉండటంతోనే అలా టవల్ చుట్టుకొని ఫీల్డింగ్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు.