ఓటీటీలే బెటర్ ఆప్షన్ : శేఖర్ కపూర్

కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని చాలా దెబ్బ తీసింది. ఇప్పటికీ థియేటర్లు ఓపెన్ కాక.. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్‌కు నోచుకోవడం లేదు. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు నిర్మాతలు థియేటర్ల ప్రారంభం కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో చేసేదేమీ లేక ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయమై నిర్మాతలకు సూచనలిస్తూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్. ఏడాది గడిచినా సరే, థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఒకవేళ […]

Update: 2020-07-14 06:49 GMT

కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని చాలా దెబ్బ తీసింది. ఇప్పటికీ థియేటర్లు ఓపెన్ కాక.. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్‌కు నోచుకోవడం లేదు. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు నిర్మాతలు థియేటర్ల ప్రారంభం కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో చేసేదేమీ లేక ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

ఈ విషయమై నిర్మాతలకు సూచనలిస్తూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్. ఏడాది గడిచినా సరే, థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఓపెన్ అయినా.. జనాలు లేక మొదటి వారంలో రూ.100 కోట్లకు పైగా నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు. అంటే థియేట్రికల్ స్టార్ సిస్టమ్ అనేది చనిపోతుందన్నారు శేఖర్ కపూర్. ఈ పరిస్థితుల్లో నిర్మాతలు, స్టార్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించడం బెటర్ అని సలహా ఇస్తున్నారు. లేదంటే సొంత యాప్‌ల ద్వారా సినిమాను ప్రసారం చేసుకోవచ్చని చెబుతున్నారు. టెక్నాలజీ అనేది చాలా సింపుల్ అని.. యూజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది వినడానికి చాలా బాగుందన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఒక యుగానికే డూమ్స్ డే ప్రెడిక్షన్ లా ఉందన్నారు.

Tags:    

Similar News