నగర ‘మేయరా’ మజాకా..!

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కొత్త మేయర్‌గా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని పార్టీ అధిష్టానం ఫిబ్రవరి 11న సీల్డ్ కవర్ రూపంలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజున కార్పోరేటర్లతో పాటు ఆమె కూడా నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించకముందు కొన్ని అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుల ధృవీకరణ పత్రం విషయంలో గత నెల షేక్‌పేట తహశీల్దార్ శ్రీనివాస్ […]

Update: 2021-02-13 09:45 GMT
నగర ‘మేయరా’ మజాకా..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కొత్త మేయర్‌గా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిని పార్టీ అధిష్టానం ఫిబ్రవరి 11న సీల్డ్ కవర్ రూపంలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజున కార్పోరేటర్లతో పాటు ఆమె కూడా నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

అయితే, విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించకముందు కొన్ని అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. కుల ధృవీకరణ పత్రం విషయంలో గత నెల షేక్‌పేట తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు వాగ్వాదం జరిగింది. తీరా సీన్ కట్‌చేస్తే.. షేక్‌పేట్ తహశీల్దార్‌పై బదిలీ వేటు పడింది. ఆయన్ను సీసీఎల్‌ఏకు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదిలాఉండగా, గద్వాల విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించే కంటే ముందే ఆయన్ను బదిలీ చేసినట్లు పలు కథనాలు సైతం వెలువడుతున్నాయి. కాగా, దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News