కడపలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం 

దిశ వెబ్ డెస్క్: కడప జిల్లా మైలవరం మండల కేంద్రంలో ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. మైలవరంలో వి ఆర్ ఏ గా విధులు నిర్వహిస్తున్న నాగ మునయ్య అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురుకి మాయమాటలు చెప్పి స్థానిక రామాలయ ఆవరణంలో నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. […]

Update: 2020-08-30 05:10 GMT
కడపలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం 
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: కడప జిల్లా మైలవరం మండల కేంద్రంలో ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. మైలవరంలో వి ఆర్ ఏ గా విధులు నిర్వహిస్తున్న నాగ మునయ్య అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన కూతురుకి మాయమాటలు చెప్పి స్థానిక రామాలయ ఆవరణంలో నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మైలవరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని విచారిస్తామని డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు.

Tags:    

Similar News