కరోనా డేంజర్ బెల్స్.. ఆక్సిజన్ అందక ఏడుగురు మృతి

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ పరిస్థితి చేదాటిపోతోందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో పొంచిఉంది. ఇప్పటికే రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసు నమోదు అవుతుండటమే కాకుండా మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. తాజాగా.. కొవిడ్ సెంటర్‌లో ఆక్సిజన్ అందక ఏడుగు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో చోటుచేసుకుంది. దీంతో […]

Update: 2021-04-19 21:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ పరిస్థితి చేదాటిపోతోందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో పొంచిఉంది. ఇప్పటికే రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసు నమోదు అవుతుండటమే కాకుండా మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. తాజాగా.. కొవిడ్ సెంటర్‌లో ఆక్సిజన్ అందక ఏడుగు మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో చోటుచేసుకుంది. దీంతో ఆస్పత్రి ఎదుట మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో చేసేదేంలేక అంబులెన్సులో ఉన్న సిలిండర్లనూ ఉపయోగిస్తున్నారు. అంతేగాకుండా.. ప్రస్తుతం కొవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News