ప్రణబ్ మృతి: వారంపాటు సంతాప దినాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలను స్మరించుకునేందుకు ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాప దినాలకు సూచకంగా రాష్ట్రపతి భవన్, కేంద్ర సెక్రటేరియట్, పార్లమెంట్ భవనంతో పాటు పలు కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేశారు. మంగళవారం ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రక్షణశాఖ ఏర్పాట్లు చేస్తోంది.