రూ. 250కే ఆస్ట్రాజెనెకా డోసు.. !

బెంగళూరు: ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో అత్యవసర వినియోగం కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నది. తాజాగా ఒక్కో డోసును రూ.250లకు సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సీరం సూచనప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. ఈ ప్రకారం ఒక్కో వ్యక్తికి రెండు డోసులకు కలపి రూ.500 వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దేశీయ ప్రైవేట్ […]

Update: 2020-12-08 04:44 GMT

బెంగళూరు: ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌పర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో అత్యవసర వినియోగం కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నది. తాజాగా ఒక్కో డోసును రూ.250లకు సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సీరం సూచనప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.

ఈ ప్రకారం ఒక్కో వ్యక్తికి రెండు డోసులకు కలపి రూ.500 వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దేశీయ ప్రైవేట్ మార్కెట్‌లో ఒక్కో టీకా డోసుకు రూ.1000 వరకు ఉండవచ్చని ఇటీవల సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అధర్ పునావాలా స్పష్టం చేశారు. కానీ, పెద్ద స్థాయిలో కేంద్ర ప్రభుత్వం డోసులు కొనుగోలు చేస్తుండటంతో ధరను భారీగా తగ్గించినట్టు సమాచారం.

Tags:    

Similar News