రెండోరోజూ లాభాల బాటలో మార్కెట్లు!

       చైనాలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తక్కువ నమోదు అవుతుండటంతో ఆసియా మార్కెట్‌లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఆసియా మార్కెట్‌ల ప్రభావం దేశీయ మదుపర్లలో ఆందోళనను తగ్గించింది. దీంతో మార్కెట్లు ఈ వారం వరుసగా రెండో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 425.99 పాయింట్ల లాభంతో 41,642 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 118.70 పాయింట్లు లాభపడి 12,226 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో హిందూస్తాన్ యూనిలివర్, నెస్లె ఇండియా కంపెనీల సూచీలు అత్యధిక […]

Update: 2020-02-11 23:52 GMT

చైనాలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తక్కువ నమోదు అవుతుండటంతో ఆసియా మార్కెట్‌లు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఆసియా మార్కెట్‌ల ప్రభావం దేశీయ మదుపర్లలో ఆందోళనను తగ్గించింది. దీంతో మార్కెట్లు ఈ వారం వరుసగా రెండో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 425.99 పాయింట్ల లాభంతో 41,642 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 118.70 పాయింట్లు లాభపడి 12,226 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో హిందూస్తాన్ యూనిలివర్, నెస్లె ఇండియా కంపెనీల సూచీలు అత్యధిక లాభాలతో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంకులు నష్టాల్లో కదలాడుతున్నాయి.

Tags:    

Similar News