స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు వారాంతం బ్రేక్ పడింది. భారీ లాభాల తర్వాత శుక్రవారం సూచీలు సానుకూలంగా మొదలైనప్పటికీ ఆ తర్వాత రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడు సెషన్లలో పుంజుకున్న తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటం వల్ల నష్టాలు నమోదయ్యాయని విశ్లేషకులు తెలిపారు. అయితే మిడ్-సెషన్ తర్వాత ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు అధికం కావడంతో స్టాక్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు వారాంతం బ్రేక్ పడింది. భారీ లాభాల తర్వాత శుక్రవారం సూచీలు సానుకూలంగా మొదలైనప్పటికీ ఆ తర్వాత రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా మూడు సెషన్లలో పుంజుకున్న తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటం వల్ల నష్టాలు నమోదయ్యాయని విశ్లేషకులు తెలిపారు. అయితే మిడ్-సెషన్ తర్వాత ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు అధికం కావడంతో స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలను చూశాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 20.46 పాయింట్లు కోల్పోయి 58,786 వద్ద, నిఫ్టీ 5.55 పాయింటు నష్టపోయి 17,511 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఎక్కువగా 2.6 శాతం పుంజుకోగా, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, మెటల్ రంగాలు బలపడ్డాయి. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఈల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.72 వద్ద ఉంది.