స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా ఊగిసలాట మధ్య కదలాడిన సూచీలు అధిక లాభాల నుంచి స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో స్టాక్ మార్కెట్లు బుధవారం నాటి ట్రెండ్‌ను కొనసాగించాయి. ఓ దశలో 400 పాయింట్లకు పైగా ర్యాలీ చేసిన సెన్సెక్స్ 50 వేల మార్కును అధిగమించింది. అనంతరం కరోనా కేసుల ప్రభావంతో మిడ్-సెషన్ తర్వాత మార్కెట్లు నెమ్మదించాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా ఊగిసలాట మధ్య కదలాడిన సూచీలు అధిక లాభాల నుంచి స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో స్టాక్ మార్కెట్లు బుధవారం నాటి ట్రెండ్‌ను కొనసాగించాయి. ఓ దశలో 400 పాయింట్లకు పైగా ర్యాలీ చేసిన సెన్సెక్స్ 50 వేల మార్కును అధిగమించింది. అనంతరం కరోనా కేసుల ప్రభావంతో మిడ్-సెషన్ తర్వాత మార్కెట్లు నెమ్మదించాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో చివర్లో లాభాలు తగ్గాయని విశ్లేషకులు తెలిపారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 84.45 పాయింట్లు లాభపడి 49,746 వద్ద ముగియగా, నిఫ్టీ 54.75 పాయింట్ల లాభంతో 14,873 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ రంగం అధికంగా 4 శాతం పుంజుకోగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు బలపడ్డాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అల్ట్రా సిమెంట్, టైటాన్, టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ షేర్లు లాభ పడగా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.63 వద్ద ఉంది.