స్వల్ప నష్టాల్లో మార్కెట్లు!

దిశ, సెంట్రల్ డెస్క్: ఆసియా మార్కెట్లు లాభపడినప్పటికీ దేశీయ ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మూడ్రోజుల అనంతరం ప్రారంభమైన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో కొనసాగాయి. అయితే, లంచ్ సమయం తర్వాత బలహీనపడటంతో సెన్సెక్స్ 63.29 పాయింట్ల నష్టంతో 30,609 వద్ద ముగియగా, నిఫ్టీ 10.20 పాయింట్లు నష్టపోయి 9,029 వద్ద ముగిసింది. ట్రేడర్లు అమ్మకాలకు దిగడంతో సెంటిమెంట్ బలహీనపడిందని, దీనికితోడు గురువారం మే నెల డెరివేటివ్ […]

Update: 2020-05-26 06:26 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: ఆసియా మార్కెట్లు లాభపడినప్పటికీ దేశీయ ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మూడ్రోజుల అనంతరం ప్రారంభమైన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో కొనసాగాయి. అయితే, లంచ్ సమయం తర్వాత బలహీనపడటంతో సెన్సెక్స్ 63.29 పాయింట్ల నష్టంతో 30,609 వద్ద ముగియగా, నిఫ్టీ 10.20 పాయింట్లు నష్టపోయి 9,029 వద్ద ముగిసింది. ట్రేడర్లు అమ్మకాలకు దిగడంతో సెంటిమెంట్ బలహీనపడిందని, దీనికితోడు గురువారం మే నెల డెరివేటివ్ సిరీస్ ముగియనుండటం వల్ల మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. రంగాల పరంగా చూస్తే..ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాల షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, ఆల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్, నెస్లె ఇండియా, ఐటీసీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో కదలాడగా, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, బజాజ్ ఫైనాస్, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

Tags:    

Similar News