వరుసగా రెండోరోజు నష్టపోయిన సూచీలు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే సంకేతాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు దేశీయ సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గురువారం ఉదయం ప్రారంభం నుంచే భారీ నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు రోజంతా ఒడుదుడుకుల మధ్యే […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే సంకేతాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు దేశీయ సూచీలు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గురువారం ఉదయం ప్రారంభం నుంచే భారీ నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు రోజంతా ఒడుదుడుకుల మధ్యే కదలాడాయి. దాదాపు అన్ని రంగాల్లోను అమ్మకాల ఒత్తిడి కనబడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 178.65 పాయింట్లు కోల్పోయి 52,323 వద్ద ముగియగా, నిఫ్టీ 76.15 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద ముగిసింది.
నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ అధికంగా పతనమైంది. బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్, మెటల్, ఫార్మా రంగాలు నీరసించాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు మెరుగ్గా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాభాలను దక్కించుకోగా, ఇండస్ఇండ్ బ్యాంక్, డా రెడ్డీస్, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకి, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.10 వద్ద ఉంది.