దేశీయ మార్కెట్ల బౌన్స్‌బ్యాక్
Latest/Business దిశ, వెబ్‌డెస్క్: వరుసగా ఆరు రోజుల నష్టాల తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) ఊహించని స్థాయిలో నిలదొక్కుకున్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో సెన్సెక్స్ (Sensex) 37 వేల మార్కును, నిఫ్టీ (Nifty)11 వేల మార్కును దాటాయి. పండుగ సీజన్‌కు ముందు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుందనే అంచనాలతో మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయనికి సెన్సెక్స్ […]
Latest/Business
దిశ, వెబ్‌డెస్క్: వరుసగా ఆరు రోజుల నష్టాల తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లు (Domestic equity markets) ఊహించని స్థాయిలో నిలదొక్కుకున్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో సెన్సెక్స్ (Sensex) 37 వేల మార్కును, నిఫ్టీ (Nifty)11 వేల మార్కును దాటాయి. పండుగ సీజన్‌కు ముందు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుందనే అంచనాలతో మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయనికి సెన్సెక్స్ 835.06 పాయింట్లు లాభపడి 37,388 వద్ద ముగియగా, నిఫ్టీ 244.70 పాయింట్లు ఎగిసి 11,050 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు అత్యధికంగా 3 శాతానికి మించి పుంజుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో, మెటల్, మీడియా, ఫార్మా, రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు 3.5 శాతం వరకు బలపడ్డాయి.
సెన్సెక్స్ ఇండెక్స్ (Sensex Index)లో అన్ని రంగాలు లాభాల్లో ట్రేడయ్యాయి. ప్రధానంగా బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ షేర్లు 5 శాతానికి పైగా లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం షేర్లు 3 శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.72 వద్ద ఉంది.