లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అయితే, అమెరికా ఆర్థిక ఉద్దీపన ఆశలు తగ్గిపోతుండటంతో బ్యాంకింగ్, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, గత వారం లాగే మార్కెట్లను ఐటీ రంగం షేర్లు నష్టాల్లోకి జారకుండా రక్షించాయి. అలాగే, సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వినియోగదారుల డిమాండ్‌ను పెంచేందుకు ఇచ్చిన చీనప్పటి ఉద్దీపన ప్రకటన దలాల్ స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో చివర్లో మార్కెట్లు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. దీంతో మార్కెట్లు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అయితే, అమెరికా ఆర్థిక ఉద్దీపన ఆశలు తగ్గిపోతుండటంతో బ్యాంకింగ్, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, గత వారం లాగే మార్కెట్లను ఐటీ రంగం షేర్లు నష్టాల్లోకి జారకుండా రక్షించాయి. అలాగే, సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వినియోగదారుల డిమాండ్‌ను పెంచేందుకు ఇచ్చిన చీనప్పటి ఉద్దీపన ప్రకటన దలాల్ స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయింది.
దీంతో చివర్లో మార్కెట్లు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 84.31 పాయింట్లు లాభపడి 40,593 వద్ద ముగియగా, నిఫ్టీ 16.75 పాయింట్ల లాభంతో 11,930 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2 శాతం క్షీణించగా, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్, మెటల్, ప్రైవేట్ రంగ బ్యాంకులు, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకి, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.31 వద్ద ఉంది.