మరోసారి ఐటీ మద్దతుతో లాభాల్లో సూచీలు!
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. యూకేలో మొదలైన కొత్త రకం వైరస్ సంకేతాలతో పాటు భారీ లాభాల స్వీకరణతో కుదేలైన సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం నుంచే ఆటుపోట్ల మధ్య కొనసాగిన స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత ఐటీ రంగం షేర్ల అండతో లాభాలను దక్కించుకున్నాయి. గ్లోబల్ హోల్‌సేల్ సంస్థ మెట్రో ఏజీతో వ్యూహాత్మక డిజిటల్, ఐటీ భాగస్వామ్య ఒప్పందం నేపథ్యంలో ప్రముఖ […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. యూకేలో మొదలైన కొత్త రకం వైరస్ సంకేతాలతో పాటు భారీ లాభాల స్వీకరణతో కుదేలైన సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం నుంచే ఆటుపోట్ల మధ్య కొనసాగిన స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత ఐటీ రంగం షేర్ల అండతో లాభాలను దక్కించుకున్నాయి. గ్లోబల్ హోల్‌సేల్ సంస్థ మెట్రో ఏజీతో వ్యూహాత్మక డిజిటల్, ఐటీ భాగస్వామ్య ఒప్పందం నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో షేర్లు అధిక లాభాలతో ర్యాలీ చేసింది.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 437.49 పాయింట్లు ఎగసి 46,444 వద్ద ముగియగా, నిఫ్టీ 134.80 పాయింట్ల లాభంతో 13,601 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, మీడియా, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా రంగ షేర్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు మాత్రమే నష్టాల్లో కదలాడగా, మిగిలిన అన్ని సూచీలు లాభాలను చూశాయి. ముఖ్యంగా హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.68 వద్ద ఉంది.