'పిల్లలు బిహార్‌లో ఉన్నరు.. మేం పోతాం సార్'

దిశ, నల్లగొండ: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 30 మంది వలస కూలీలు వివిధ రైస్​ మిల్లుల్లో పనిచేస్తున్నారు. వీరు గత రెండు మూడు నెలల క్రితం పొట్టకూటి కోసం బిహార్​ రాష్ట్రం నుంచి వచ్చారు. వచ్చిన నెల రోజులకే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. తమ వాళ్లు బీహార్​లో ఎలా ఉన్నారోననే ఆందోళనతో జీవనం సాగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. తమ పిల్లలు బిహార్​లో ఉన్నారని… వారి వద్దకు వెళ్లేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. […]

Update: 2020-05-11 07:42 GMT

దిశ, నల్లగొండ: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 30 మంది వలస కూలీలు వివిధ రైస్​ మిల్లుల్లో పనిచేస్తున్నారు. వీరు గత రెండు మూడు నెలల క్రితం పొట్టకూటి కోసం బిహార్​ రాష్ట్రం నుంచి వచ్చారు. వచ్చిన నెల రోజులకే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. తమ వాళ్లు బీహార్​లో ఎలా ఉన్నారోననే ఆందోళనతో జీవనం సాగిస్తున్నట్లు వారు చెబుతున్నారు. తమ పిల్లలు బిహార్​లో ఉన్నారని… వారి వద్దకు వెళ్లేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. నెలరోజుల క్రితం తహశీల్దార్​ తమ వివరాలు తీసుకున్నారని… ప్రభుత్వం అందించే 500 రూపాయలు, బియ్యం అందింది కానీ, తమకు ఇంతవరకూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించలేదని వాపోతున్నారు. త్వరగా ప్రభుత్వం తమ స్వంతరాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News