సీడ్స్ రవాణాకు ఆటంకం కలిగించొద్దు!
దిశ, న్యూస్‌బ్యూరో : దేశవ్యాప్తంగా విత్తన ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర విత్తన ఉత్పత్తిదారులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో సమవేశమైన సీడ్స్ ఉత్పత్తిదారులు.. ఈ మేరకు పలు అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ నుంచి సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పోలీసులకు అవగాహన లేక ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లకు సీడ్స్ చేరనివ్వాలని కోరారు. దేశానికి అవసరమైన 80 […]
దిశ, న్యూస్‌బ్యూరో :
దేశవ్యాప్తంగా విత్తన ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర విత్తన ఉత్పత్తిదారులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో సమవేశమైన సీడ్స్ ఉత్పత్తిదారులు.. ఈ మేరకు పలు అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ నుంచి సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పోలీసులకు అవగాహన లేక ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లకు సీడ్స్ చేరనివ్వాలని కోరారు. దేశానికి అవసరమైన 80 శాతం సీడ్స్ తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని ఈ సందర్భంగా వినోద్ కుమార్‌కు వివరించారు.
తక్షణమే స్పందించిన వినోద్ కుమార్.. సమస్యను డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. లాక్‌డౌన్ నుంచి సీడ్స్ సరఫరాను సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని ఆయనకు గుర్తు చేశారు. కాగా, డీజీపీ.. డీఐజీ సుమతిని నోడల్ అధికారిగా నియమించి విత్తన ఉత్పత్తిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా చూడాలని ఆదేశించారు.
Tags: Lock down, Seeds transportation, Vinod Kumar, DGP, DIG