ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువతున్నాయి. ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అల్ ఖైదా ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టుపై దాడికి ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎయిర్‌పోర్టు వద్ద భద్రతను పెంచారు. అన్ని టెర్మినళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా ఎలాంటి వస్తువుల లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్బంగా […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువతున్నాయి. ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అల్ ఖైదా ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టుపై దాడికి ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎయిర్‌పోర్టు వద్ద భద్రతను పెంచారు.
అన్ని టెర్మినళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా ఎలాంటి వస్తువుల లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అల్‌ఖైదా ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లో బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు శనివారం సమాచారం ఇచ్చింది. కరణ్బిర్ సూరి అలియాస్ మహమ్మద్ జలాల్, అతడి భార్య షేలీ శార్దా అలియాస్ హసీనా సింగపూర్ నుంచి భారత్‌కు ఆదివారం వస్తున్నారని అందులో పేర్కొన్నారు.
1-3 రోజుల్లో బాంబు దాడి చేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులు అవాస్తవమని రాత్రి 7.18 గంటలకు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. అయితే, ఈ బెదిరింపులు అవాస్తవమని విచారణలో తేలినట్లు ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు(ఐజీఐ) అధికారిక ప్రకటనలో పేర్కొంది. బాంబు స్క్వాడ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. అయినా.. అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.