సెక్యూరిటీ గార్డ్ టు టెక్ ఆఫీసర్.. ఇన్‌స్పైరింగ్ జర్నీ

దిశ, ఫీచర్స్ : నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ పోవాలే గానీ ఏదో ఒక రోజు మనం అనుకున్నది సాధించి తీరుతాం. పదో తరగతితోనే చదువు ఆపేసిన అస్సాం యువకుడు అబ్దుల్ అలీమ్ జీవితమే అందుకు ఉదాహరణ. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగం కోసం చెన్నై వెళ్లిన అలీమ్.. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మరి సెక్యూరిటీ గార్డ్ నుంచి సాఫ్ట్‌వేర్ జాబ్ […]

Update: 2021-03-21 08:54 GMT

దిశ, ఫీచర్స్ : నిరాశ చెందకుండా ప్రయత్నిస్తూ పోవాలే గానీ ఏదో ఒక రోజు మనం అనుకున్నది సాధించి తీరుతాం. పదో తరగతితోనే చదువు ఆపేసిన అస్సాం యువకుడు అబ్దుల్ అలీమ్ జీవితమే అందుకు ఉదాహరణ. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగం కోసం చెన్నై వెళ్లిన అలీమ్.. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మరి సెక్యూరిటీ గార్డ్ నుంచి సాఫ్ట్‌వేర్ జాబ్ వరకు అతడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందో తెలుసుకుందాం.

2013 సంవ్సతరం.. జేబులో 1000 రూపాయలతో చెన్నై ట్రెయిన్ ఎక్కాడు అలీమ్. టెన్త్ వరకే చదివిన తనకు ఉద్యోగం దొరకడం కష్టమైంది. ఈ క్రమంలో రెండు నెలల పాటు ఎన్నో ఆఫీస్‌ మెట్లెక్కిన తనకు ఎక్కడా జాబ్ రాలేదు. చివరగా చెన్నైలోని జోహో కార్యాలయంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం లభించింది. అయితే ఓ రోజు ఆ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి షిబు అలెక్సిస్.. అలీమ్‌ ఎడ్యుకేషన్ వివరాలతో పాటు అతడి కంప్యూటర్ నాలెడ్జ్‌పై ఆరా తీశాడు. పదో తరగతి పూర్తిచేసిన తను హెచ్‌టీఎమ్‌ఎల్(HTML) బేసిక్స్ నేర్చుకున్నానని, ఇప్పటికీ చదువుకోవాలనే ఉన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల కుదరడం లేదని అలీమ్ సమాధానమిచ్చాడు. అతడి మాటలు విన్న షిబు.. అలీమ్‌కు కంప్యూటర్ పాఠాలు చెప్పేందుకు ముందుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుగా రోజుకు 12 గంటలు పనిచేస్తూనే, షిబు దగ్గర సాఫ్ట్‌వేర్​టూల్స్, కోడింగ్​నేర్చుకున్నాడు అలీమ్. ఇలా ఎనిమిది నెలల్లోనే కోడింగ్‌పై పట్టు సాధించి తనే స్వయంగా ఒక యాప్‌ రూపొందించాడు. ఆ యాప్‌ను షిబు తన మేనేజర్‌కు చూపించగా అలీమ్​ప్రతిభను మెచ్చుకుని సాఫ్ట్‌వేర్ జాబ్ ఇవ్వడం విశేషం.

నేను నా జీవితంలో ఇంటర్వ్యూకు వెళ్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే నేను 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నా. డిగ్రీలు కాదు, స్కిల్స్ మాత్రమే ముఖ్యమని జోహో సంస్థ నిరూపించింది. దానికి చక్కటి ఉదాహరణ నేనే. విద్యార్హతలు లేకపోయినా నన్ను ఉద్యోగంలోకి తీసుకున్న జోహో సంస్థకు కృతజ్ఞతలు. నాకు శిక్షణనిచ్చి ప్రోత్సహించిన నా సీనియర్ ఉద్యోగి షిబు అలెక్సిస్‌కు ఎంతగానో రుణపడి ఉంటాను. నేను మరింత రాయాలనుకున్నాను. కానీ లింక్డ్‌ఇన్‌లో క్యారెక్టర్ లిమిట్ కారణంగా, పోస్ట్‌ను తగ్గించాల్సి వచ్చింది. అంతేకాదు నా పూర్ ఇంగ్లీష్‌తో ఇబ్బందిపడి ఉంటే క్షమించండి. నేను పాఠశాలలో(అస్సామీ) వేరే మాధ్యమంలో చదువుకున్నాను. ఇంగ్లీష్ నాకో బౌన్సర్ సబ్జెక్ట్.

– అలీమ్

Tags:    

Similar News