ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు
దిశ, క్రైమ్‌బ్యూరో: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు టెర్రరిస్టుల నుంచి ప్రాణాపాయం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో ప్రభుత్వం భద్రతను పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ కంటే ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో భద్రతను పెంచారు. ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై తిరగవద్దని, భద్రత రీత్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తిరగాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, తనకు లైసెన్స్ గన్ కోరుతూ హైదరాబాద్ సీపీకి గతంలో […]
దిశ, క్రైమ్‌బ్యూరో: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు టెర్రరిస్టుల నుంచి ప్రాణాపాయం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో ప్రభుత్వం భద్రతను పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ కంటే ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో భద్రతను పెంచారు. ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై తిరగవద్దని, భద్రత రీత్యా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తిరగాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, తనకు లైసెన్స్ గన్ కోరుతూ హైదరాబాద్ సీపీకి గతంలో లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా తనకు లైసెన్స్ గన్ మంజూరు చేయాలని కోరారు. గోషామహాల్ నియోజకవర్గంలో అత్యధికంగా స్లమ్స్ ఉన్నందున నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు కారులో వెళ్లలేనని, బైక్ పై మాత్రమే సులువుగా ఉంటుందని అన్నారు.