ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే

దిశ, వెబ్‎డెస్క్ : ఆంధ్ర-కర్నాటక సరిహద్దులోని ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే కొనసాగుతోంది. అక్రమ మైనింగ్‌తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి.. మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో రీ సర్వేను నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో ఏపీ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. వందేళ్ల నాటి గెజిట్లు, భూపటాలను, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వే అనంతరం హద్దులు నిర్ణయించి 110 […]

Update: 2020-10-19 22:24 GMT

దిశ, వెబ్‎డెస్క్ : ఆంధ్ర-కర్నాటక సరిహద్దులోని ఓబుళాపురం గనుల వద్ద రెండో రోజు సర్వే కొనసాగుతోంది. అక్రమ మైనింగ్‌తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి.. మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో రీ సర్వేను నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో ఏపీ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. వందేళ్ల నాటి గెజిట్లు, భూపటాలను, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సర్వే అనంతరం హద్దులు నిర్ణయించి 110 చోట్ల పిల్లర్లు వేయాలని సర్వేఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది.

Tags:    

Similar News