గవర్నర్ కార్యాలయంపై నిమ్మగడ్డ సంచలన ఆరోపణలు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలచే ఆయన మరోసారి అలాంటి అరోపణలే చేశారు. తాజాగా తాను గవర్నర్ భిశ్శభూషన్‌తో జరుపుతున్న చర్చలన్నీ బయటకు లీకవుతున్నాయని, ఈ విషయంపై విచారణ జరపాలని హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు. తాను గవర్నర్‌కు రాస్తున్న లెటర్స్ అన్ని పబ్లిక్ కాదని, ప్రివిలేజ్ లెటర్స్ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవి […]

Update: 2021-03-20 00:40 GMT
SEC Nimmagadda Ramesh Kumar, AP High Court
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలచే ఆయన మరోసారి అలాంటి అరోపణలే చేశారు. తాజాగా తాను గవర్నర్ భిశ్శభూషన్‌తో జరుపుతున్న చర్చలన్నీ బయటకు లీకవుతున్నాయని, ఈ విషయంపై విచారణ జరపాలని హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐతో విచారణ జరపాలని కోరారు. తాను గవర్నర్‌కు రాస్తున్న లెటర్స్ అన్ని పబ్లిక్ కాదని, ప్రివిలేజ్ లెటర్స్ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. అవి గవర్నర్ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో విచారణ జరపించాలని కోరారు. తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయని, మంత్రులు తాను గవర్నర్‌కు రాసిన లెటర్స్ సోషల్ మీడియాలో చూశామని అంటున్నారని, అది ఎలా సాధ్యమో విచారించాలని సూచించారు. గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ఈ పిటిషన్‌లో నిమ్మగడ్డ ప్రతివాదులుగా చేర్చారు. కాగా, దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News