ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం : ఎస్ఈసీ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి దృష్ట్యా వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 11 పార్టీల ప్రతినిధులు నేరుగా హాజరయ్యారని, మరో రెండు పార్టీలు తమ అభిప్రాయాన్ని పంపాయని కోర్టుకు విన్నవించారు. కరోనా కేసులు గతంలో కన్నా తగ్గాయని పేర్కొన్నారు. హింసాత్మక […]
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వ్యాప్తి దృష్ట్యా వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 11 పార్టీల ప్రతినిధులు నేరుగా హాజరయ్యారని, మరో రెండు పార్టీలు తమ అభిప్రాయాన్ని పంపాయని కోర్టుకు విన్నవించారు. కరోనా కేసులు గతంలో కన్నా తగ్గాయని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న చోట ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని, వీటిపై విచారణ జరపాలని ఆయా పార్టీలు కోరినట్లు ఎస్‌ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.