చనిపోయిన కుటుంబాలకు డిపార్ట్‌మెంట్ ఎప్పుడూ అండగా ఉంటది: సీపీ
దిశ, సిద్దిపేట: విధుల నిర్వహణలో మృతి చెందిన ఏఅర్ఎస్ఐ అలెగ్జాండర్ నిత్యానందం కుటుంబానికి పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ చెక్కులు అందించారు. సిద్దిపేట సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఐ అలెగ్జాండర్ నిత్యానందం అనారోగ్యంతో నిజామాబాద్ హోప్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆగస్ట్ 10న మృతిచెందాడు. అతని కుటుంబానికి పోలీస్ భద్రత తరపున వచ్చిన రూ. 4 లక్షల చెక్కును, అదేవిధంగా విడో ఫండ్ కింద రూ. 50 వేల చెక్కును నిత్యానందం […]
దిశ, సిద్దిపేట: విధుల నిర్వహణలో మృతి చెందిన ఏఅర్ఎస్ఐ అలెగ్జాండర్ నిత్యానందం కుటుంబానికి పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ చెక్కులు అందించారు. సిద్దిపేట సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఐ అలెగ్జాండర్ నిత్యానందం అనారోగ్యంతో నిజామాబాద్ హోప్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆగస్ట్ 10న మృతిచెందాడు. అతని కుటుంబానికి పోలీస్ భద్రత తరపున వచ్చిన రూ. 4 లక్షల చెక్కును, అదేవిధంగా విడో ఫండ్ కింద రూ. 50 వేల చెక్కును నిత్యానందం కుటుంబానికి కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మృతి చెందిన ఏఅర్ఎస్ఐ కుటుంబానికి డిపార్ట్మెంట్ తరఫున రావాలసిన అన్ని బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామన్నారు. పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకుని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గురించి త్వరలో ప్రపోజల్స్ పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సబిత, ఎస్. కె జమీల్ అలీ, ఉమ్మడి జిల్లా పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.