తేలు కాటుతో వ్యవసాయ కూలీ మృతి

దిశ, ఏటూరునాగారం: వరినాట్లకు వెళ్లిన వ్యవసాయ కూలీ తేలు కాటుకు గురై మృతిచెందింది. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఇందిరానగర్ బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న పెండ్యాల శ్రీలత(20), శ్రీకాంత్ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగా‌‌‌ బుధవారం‌ వరి నాట్లకు వెళ్లారు. వరి నారు కట్టలు పొలంలో వేస్తున్న క్రమంలో తేలు కరిచింది. బాధితురాలు తీవ్ర […]

Update: 2020-08-12 11:51 GMT

దిశ, ఏటూరునాగారం: వరినాట్లకు వెళ్లిన వ్యవసాయ కూలీ తేలు కాటుకు గురై మృతిచెందింది. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఇందిరానగర్ బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న పెండ్యాల శ్రీలత(20), శ్రీకాంత్ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అందులో భాగంగా‌‌‌ బుధవారం‌ వరి నాట్లకు వెళ్లారు. వరి నారు కట్టలు పొలంలో వేస్తున్న క్రమంలో తేలు కరిచింది. బాధితురాలు తీవ్ర ఇబ్బంది పడుతుడడంతో తాడ్వాయి పీహెచ్‌సీ‌కి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటనే 108 వాహనంలో ములుగు సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికత్స పొందుతూ మృతిచెందింది.

Tags:    

Similar News