జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిక

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి నేరుగా బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సింధియాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. పార్టీ సభ్యత్వం ఇచ్చారు. బీజేపీ కండువా కప్పారు. పార్టీలోకి సింధియాను సాదారంగా జేపీ నడ్డా ఆహ్వానించారు. తన తండ్రి మాధవరావు సింధియా మరణం తర్వాత జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ […]

Update: 2020-03-11 04:02 GMT

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి నేరుగా బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సింధియాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు. పార్టీ సభ్యత్వం ఇచ్చారు. బీజేపీ కండువా కప్పారు. పార్టీలోకి సింధియాను సాదారంగా జేపీ నడ్డా ఆహ్వానించారు. తన తండ్రి మాధవరావు సింధియా మరణం తర్వాత జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో స్వతంత్ర హోదాలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలతో అసంతృప్తికి గురైన ఆయన మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

Tags: Ex minister jyotiraditya scindia, bjp, join

Tags:    

Similar News