మహాసముద్రాల నీటిలో గ్రహాంతరవాసుల మూలాలు

దిశ, ఫీచర్స్ : భూగ్రహం 71 శాతం నీటితోనే నిండి ఉంది. ఇలా ఎక్కువ భాగం నీటితో ఆవరించి ఉండటం వల్లే అంతరిక్షం నుంచి చూస్తే భూమి ప్రత్యేకమైన నీలి రంగులో కనిపిస్తుంది. కానీ వేల సంవత్సరాల కిందటి నుంచి సముద్రాల్లో ఉంటున్న నీటికి మూలం ఎక్కడిదనే వాదన ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలింది. 4.5 బిలియన్ ఏళ్ల కిందట ధూళి, వాయువు మేఘాల్లో కలిసిపోయినప్పటి నుంచి ఈ ప్రపంచంలో నీరు ఉందని కొందరు పరిశోధకులు వాదించారు. నిజానికి […]

Update: 2021-12-16 07:22 GMT

దిశ, ఫీచర్స్ : భూగ్రహం 71 శాతం నీటితోనే నిండి ఉంది. ఇలా ఎక్కువ భాగం నీటితో ఆవరించి ఉండటం వల్లే అంతరిక్షం నుంచి చూస్తే భూమి ప్రత్యేకమైన నీలి రంగులో కనిపిస్తుంది. కానీ వేల సంవత్సరాల కిందటి నుంచి సముద్రాల్లో ఉంటున్న నీటికి మూలం ఎక్కడిదనే వాదన ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలింది. 4.5 బిలియన్ ఏళ్ల కిందట ధూళి, వాయువు మేఘాల్లో కలిసిపోయినప్పటి నుంచి ఈ ప్రపంచంలో నీరు ఉందని కొందరు పరిశోధకులు వాదించారు. నిజానికి భూమి ఒక రిజర్వాయర్ వంటిదని తెలిపారు.

కానీ కొందరు శాస్త్రవేత్తలు భిన్నమైన, స్పష్టతతో కూడినటువంటి దృక్కోణాన్ని కలిగి ఉన్నారు. వారి అంచనా ప్రకారం.. భూమి ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయి నిర్జీవంగా ఉంది. ఇప్పుడున్న మహాసముద్రాల్లోని నీరు కేవలం గ్రహాంతర వనరుల నుంచి కురిసిన మంచు, వర్షాల ఫలితంగానే ఏర్పడింది. ప్రస్తుతం భూగ్రహాన్ని కప్పి ఉంచే 332,500,000 క్యూబిక్ మైళ్ల నీటికి గ్రహాంతరవాసులే కారణమని వారి సిద్ధాంతం సూచిస్తోంది. అంతేకాదు వాస్తవానికి మన సముద్రాలు ‘ఈ ప్రపంచం వెలుపల’ ఉన్నాయనే పరికల్పనకు ఇప్పుడు బ్రిటిష్ శాస్త్రవేత్తలు మద్దతిస్తున్నారు.

జపనీస్ రోబో ప్రోబ్ ద్వారా భూమిపైకి తీసుకొచ్చిన ‘25143 ఇటోకావా’ అనే గ్రహశకలానికి సంబంధించిన క్రిస్టల్స్‌ను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం.. మహాసముద్రాలు బాహ్య అంతరిక్షం నుంచి వచ్చాయనే పరికల్పనకు వారి పరిశోధన మద్దతిస్తుందని నిర్ధారించింది. గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త లూక్ డాలీ.. ధూళిపై చేసిన అధ్యయనం ద్వారా మహాసముద్రాలు సౌర వ్యవస్థలోని ఇతర భాగాల నుంచి వచ్చిన నీటి ద్వారా ఏర్పడినట్లుగా బలమైన సాక్ష్యాలను అందిస్తోందని చెప్పారు. భూమిపై ఉన్న నీటిలో కనీసం సగం వరకు ఇంటర్ ప్లానెటరీ డస్ట్ ద్వారా ఫిల్టర్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించిన నివేదికలో.. ఉల్క(ఆస్టరాయిడ్) నుంచి సేకరించిన గ్రెయిన్స్‌(పార్టికల్స్)లో గరిష్ట మొత్తంలో నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. డాలీ, అతని సహచరులు అటామ్-ప్రోబ్ టోమోగ్రఫీని ఉపయోగించి భూమిపైకి తిరిగొచ్చిన ‘ఇటోకావా 25143’ ఆస్టరాయిడ్ నుంచి సేకరించిన ధూళిని పరిశీలించారు. డాలీ వివరించినట్లుగా.. సూర్యుని నుంచి వెలువడే కణాల ప్రవాహంతో పాటు సౌర గాలి ద్వారా నీరు సృష్టించబడింది. సౌర వ్యవస్థ అంతటా తేలియాడే ధూళితో ఏర్పడ్డ మేఘాల్లో ఈ కణాలు నీటి బిందువులను సృష్టించేందుకు ఆక్సిజన్ అణువులతో సంకర్షణం చెందుతాయి. భూమి, సూర్యుని చుట్టూ తిరుగుతున్నందున దుమ్ము రేణువులు, మంచు బిందువు కరిగి ఆకాశం నుంచి భూమిపై వర్షం రూపంలో కురుస్తుంది.

అయితే అధ్యయన బృందంలో భాగమైన గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మార్టిన్ లీ.. సముద్రాలలో కనిపించే నీరంతా సౌర ధూళి కణాల నుంచి వచ్చినది కాదని నొక్కి చెప్పారు. భూమిపై కూలిపోతున్న తోకచుక్కలు, గ్రహశకలాల నుంచి మంచు రూపంలో సమాన సహకారం అందించినట్లు తెలిపారు. ఆయన వాదన ప్రకారం.. సౌర ధూళి, మంచుతో కూడిన తోకచుక్కలు మనకు మహాసముద్రాలను అందించాయి. ఆ తర్వాత అందులో జీవులు పరిణామం చెందాయి. ఈ ఆవిష్కరణ భూమిపై నీటి మూలాల గురించి బలవంతపు సాక్ష్యాలను అందించడానికి మాత్రమే కాకుండా, అనేక ఇతర కారణాల వల్ల కూడా ముఖ్యమైనది. మన సౌర వ్యవస్థలోని ఇతర ప్రపంచాలపై బహుశా మంచు రూపంలో నీరు ఉండవచ్చని ఇది సూచిస్తుంది.

Tags:    

Similar News