దవడల లాకింగ్‌తో బరువు తగ్గించే డివైస్

దిశ, ఫీచర్స్ : ఊబకాయం ప్రపంచాన్ని వేధిస్తున్న పధ్రాన సమస్యల్లో ఒకటి. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వెయిట్ తగ్గించుకునేందుకు చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. కనిపించిన ప్రతీ సొల్యూషన్‌ను ఫాలో అవుతుంటారు. అయినా ఫలితం దక్కకపోవడంతో నిరాశ చెందుతుంటారు. ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ‘వరల్డ్స్ ఫస్ట్’ వెయిట్ లాస్ డివైస్‌ను అభివృద్ధి చేశారు. లాకింగ్ బోల్టులతో డిజైన్ చేసిన ఈ పరికరాన్ని ధరిస్తే.. సంబంధిత వ్యక్తి ఘనపదార్థాలు తీసుకునేందుకు వీలుగా […]

Update: 2021-06-29 06:40 GMT

దిశ, ఫీచర్స్ : ఊబకాయం ప్రపంచాన్ని వేధిస్తున్న పధ్రాన సమస్యల్లో ఒకటి. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే వెయిట్ తగ్గించుకునేందుకు చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. కనిపించిన ప్రతీ సొల్యూషన్‌ను ఫాలో అవుతుంటారు. అయినా ఫలితం దక్కకపోవడంతో నిరాశ చెందుతుంటారు. ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ‘వరల్డ్స్ ఫస్ట్’ వెయిట్ లాస్ డివైస్‌ను అభివృద్ధి చేశారు. లాకింగ్ బోల్టులతో డిజైన్ చేసిన ఈ పరికరాన్ని ధరిస్తే.. సంబంధిత వ్యక్తి ఘనపదార్థాలు తీసుకునేందుకు వీలుగా దవడను తెరవనీయకుండా అడ్డుకుంటుంది.

న్యూజిలాండ్, ఒటాగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు యూకేతో కలిసి ఈ మాగ్నెటిక్ డివైస్‌ను డెవలప్ చేశారు. దీన్ని ధరించిన వ్యక్తులు, తమ డైట్‌లో ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకునే వీలుండగా.. మాట్లాడేందుకు, శ్వాస తీసుకునేందుకు ఇది ఎలాంటి ఆటంకం కలిగించదు. డైట్‌ పాటించేలా చేయడంలో ఈ డివైస్ హెల్ప్‌ఫుల్ అని ఒటాగో హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ప్రో వైస్ చాన్సలర్, లీడ్ రీసెర్చర్ అయిన పాల్ బ్రూంటన్ తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి ట్రయల్స్‌లో పాల్గొన్న పార్టిసిపెంట్స్ రెండు వారాల్లోనే 6.36 కిలోల బరువు తగ్గగా.. ఆ తర్వా వారు తమ వెయిట్ లాస్ ప్రాసెస్‌ను కంటిన్యూ చేసిన్నట్టు వెల్లడించారు. ఈ మాగ్నెట్ డివైస్‌ను దవడ పళ్ల వరుసకు డెంటిస్ట్‌తో ఫిట్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తొలగించి మళ్లీ యథావిధిగా అమర్చుకోవచ్చు.

ఈ డివైస్ గురించి ప్రకటించిన తర్వాత.. సోషల్ మీడియా యూజర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. బాధితులు లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకునేలా ఈ పరికరం ఫోర్స్ చేస్తు్న్నట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా ఈ కామెంట్లపై ఒటాగో యూనివర్సిటీ క్లారిటీనిచ్చింది. ఈ పరికరం వేగంగా లేదా దీర్ఘకాలికంగా బరువు తగ్గించే పరిష్కారంగా ఉద్దేశించబడలేదని సూచించింది. శస్త్రచికిత్స అవసరమున్న వారికి ఆలోగా సాయపడటంతో పాటు బరువు తగ్గే వరకు శస్త్రచికిత్స చేసే అవకాశం లేని వ్యక్తులకు ఇది ఉపయోగపడుతుందని వివరించింది. అంతేకాదు యూజర్లు రెండు లేదా మూడు వారాల తర్వాత అందులోని అయస్కాంతాలను విడదీయవచ్చని, పరికరాన్ని తొలగించవచ్చని పేర్కొంది.

Tags:    

Similar News