‘వైటెస్ట్’ పెయింట్ సృష్టించిన సైంటిస్ట్.. గ్లోబల్ వార్మింగ్ తగ్గేనా ?
దిశ, ఫీచర్స్ : యూఎస్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ప్రపంచంలోని ‘వైటెస్ట్ పెయింట్’ను సృష్టించగా, దాని ప్రాపర్టీస్ గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాడగలవు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సహా, అతడి బృందం జియులిన్ రువాన్ ఈ పెయింట్‌ను అభివృద్ధి చేశాడు. పెయింట్ చాలా తెల్లగా ఉండటంతో ‘వరల్డ్స్ వైటెస్ట్ పెయింట్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న ‘గ్లోబర్ వార్మింగ్’ను తగ్గించడంలోనూ ఇది తోడ్పడుతుంది. ఈ తెలుపు రంగు 98.1% […]
దిశ, ఫీచర్స్ : యూఎస్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ప్రపంచంలోని ‘వైటెస్ట్ పెయింట్’ను సృష్టించగా, దాని ప్రాపర్టీస్ గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా పోరాడగలవు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సహా, అతడి బృందం జియులిన్ రువాన్ ఈ పెయింట్‌ను అభివృద్ధి చేశాడు. పెయింట్ చాలా తెల్లగా ఉండటంతో ‘వరల్డ్స్ వైటెస్ట్ పెయింట్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న ‘గ్లోబర్ వార్మింగ్’ను తగ్గించడంలోనూ ఇది తోడ్పడుతుంది.
ఈ తెలుపు రంగు 98.1% సౌర కాంతిని ప్రతిబింబిస్తుంది. ఇది విడుదల చేసే ఇన్‌ఫ్రారెడ్ హీట్, భవనాల చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తుంది. ఇది సూర్యతాపాన్ని తక్కువగా గ్రహించే లక్షణాన్ని కలిగి ఉండటం వల్ల ఇది ఎయిర్ కండీషనర్ల వాడకాన్ని తగ్గించగలదు. సాధారణంగా కమర్షియల్ వైట్ పెయింట్ సూర్యకాంతిలో 80 -85 శాతం మాత్రమే రిఫ్లెక్ట్ చేయగలదు.
‘సాధారణ కమర్షియల్ వైట్ పెయింట్ చల్లగా కాకుండా వెచ్చగా ఉంటుంది. వాటి పరిసరాల కంటే ఉపరితలాలను చల్లగా చేయలేవు. సుమారు 1,000 చదరపు అడుగుల పైకప్పు ప్రాంతాన్ని కవర్ చేయడానికి పెయింట్‌ను ఉపయోగించడం వల్ల 10 కిలోవాట్ల కూలింగ్ పవర్ ఉత్పత్తి చేయగలదు. చాలా ఇళ్లలో ఉపయోగించే ఎయిర్ కండీషనర్ల కంటే ఇది చాలా శక్తివంతమైనది. మేము ఈ ప్రాజెక్ట్‌ను ఏడేళ్ల క్రితం ప్రారంభించినప్పుడు, మేము ఎంతో విద్యుత్ శక్తిని ఆదా చేశాం.
– రువాన్, పర్డ్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్
ఉపరితలం లేదా శరీరం ద్వారా రిఫ్లెక్ట్ అయ్యే (ప్రతిబింబించే) కాంతిని ‘అల్బెడో’గా వర్ణిస్తారు. ఇది సాధారణంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాల ప్రతిబింబ లక్షణాలను వివరించడానికి ఉపయోగిస్తారు. ఆర్కిటిక్‌లో ఇటీవలి ఆల్బెడో తగ్గుదల.. ఉపరితలంపై వేడి శోషణ(అబ్జర్షన్)ను పెంచినందున ఇది వాతావరణ శాస్త్రంలోనూ ప్రధానంగా మారింది. వైట్ పెయింట్ కూడా సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తుండటంతో సగటు ప్రపంచ ఉష్ణోగ్రతపై భారీ ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.