కొవిడ్‌ను గుర్తించే మాస్క్ రూపొందించిన జపాన్ సైంటిస్ట్స్…
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లుగా కొవిడ్ భయాందోళనలు కొనసాగుతున్నాయి. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత ఉపశమనం లభించినప్పటికీ కరోనా మాత్రం రూపాంతరం చెందుతూ పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రజలపై దండెత్తుతూనే ఉంది. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ‘ఒమిక్రాన్’ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జపాన్ శాస్త్రవేత్తలు.. కరోనా పాజిటివ్ వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆటోమేటిక్‌గా మెరిసే మాస్క్‌ను రూపొందించారు. జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ గ్లోయింగ్ […]
దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లుగా కొవిడ్ భయాందోళనలు కొనసాగుతున్నాయి. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత ఉపశమనం లభించినప్పటికీ కరోనా మాత్రం రూపాంతరం చెందుతూ పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రజలపై దండెత్తుతూనే ఉంది. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ‘ఒమిక్రాన్’ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జపాన్ శాస్త్రవేత్తలు.. కరోనా పాజిటివ్ వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆటోమేటిక్‌గా మెరిసే మాస్క్‌ను రూపొందించారు.
జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ గ్లోయింగ్ మాస్క్‌ను అభివృద్ధి చేశారు. వైరస్‌కు కాంటాక్ట్ అవగానే మాస్క్ ఫ్లోరోసెంట్‌గా మారిపోతుంది. ఈ ముసుగులో ఆస్ట్రిచ్ ఎగ్స్‌తో పాటు ఫ్లోరోసెంట్ డైకు సంబంధించిన పదార్థాలున్నాయి. ప్రభుత్వ అనుమతి లభించినట్లయితే, ఈ కొవిడ్-డిటెక్టింగ్ ఫ్లోరోసెంట్ మాస్క్‌లు 2022 నాటికి మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని పరిశోధకుల బృందం పేర్కొంది. ఆస్ట్రిచ్ పక్షులు స్వతహాగా తమ శరీరంలోని ఫారిన్ ఎంటిటీస్‌ను చంపగల ప్రతిరోధకాలను సృష్టించగలవు. అందువల్లే దీన్ని మాస్క్ తయారీలో ఉపయోగించారు. అంతేకాదు మాస్క్ నుంచి బయటకు తీయగలిగే ఒక ప్రత్యేక ఫిల్టర్‌తో అమర్చబడిన స్ప్రేను అందులో పొందుపరచగా, ఆస్ట్రిచ్ ఎగ్ నుంచి సేకరించిన కొవిడ్-19 యాంటీబాడీస్‌తో ఫ్లోరోసెంట్ డైని కలిగి ఉన్న స్ప్రేను రూపొందించారు.
ప్రజలు కొవిడ్-19 కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేసేందుకు మాస్క్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముసుగు మెరుస్తున్నట్లయితే, ఈ వ్యక్తులు ప్రారంభ చికిత్సను పొందవచ్చు. అంతేకాదు ఇతరులకు వ్యాప్తి కాకుండా నిరోధించవచ్చు. ఉష్ట్రపక్షి గుడ్లను ఉపయోగించి మరింత అద్భుతమైన సాంకేతికతను తయారు చేయాలని టీమ్ లీడ్ యసుహిరో సుకామోటో ఆశాభావం వ్యక్తం చేశారు. తయారు చేసేందుకు కూడా ఇదే విధమైన యంత్రాంగాన్ని ఉపయోగించాలని పరిశోధకులు భావిస్తున్నారు.