జియో మార్ట్ డీలర్‌షిప్ పేరుతో మోసాలు.. నిందితుడి అరెస్ట్

దిశ, ములుగు: సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఏఎస్పీ పోతురాజు సాయి చైతన్య సూచించారు. శనివారం ఏఎస్పీ కార్యాలయంలో సైబర్‌ క్రిమినల్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. ఏఎస్పీ పోతురాజు సాయి చైతన్య వివరాల ప్రకారం.. ‘ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కొండ వెంకటరాజు ప్రైవేట్ ఎంప్లాయి. గతేడాది కరోనా కారణంగా ఇంటివద్దనే ఉంటున్న సమయంలో.. ఓ లింక్ మొబైల్‌కి రావడంతో […]

Update: 2021-08-14 05:54 GMT

దిశ, ములుగు: సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు ఏఎస్పీ పోతురాజు సాయి చైతన్య సూచించారు. శనివారం ఏఎస్పీ కార్యాలయంలో సైబర్‌ క్రిమినల్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు.

ఏఎస్పీ పోతురాజు సాయి చైతన్య వివరాల ప్రకారం.. ‘ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన కొండ వెంకటరాజు ప్రైవేట్ ఎంప్లాయి. గతేడాది కరోనా కారణంగా ఇంటివద్దనే ఉంటున్న సమయంలో.. ఓ లింక్ మొబైల్‌కి రావడంతో దానిపై క్లిక్ చేశాడు. జియో మార్ట్‌ డీలర్‌ షిప్ అంటూ ప్రకటన వచ్చింది. ఇది నమ్మిన వెంకటరాజు జియో మార్ట్ డీలర్ షిప్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నాడు. ఇదే క్రమంలో అందుకు పలు డాక్యూమెంట్స్‌ను కూడా సబ్మిట్ చేశాడు. సుమారు రూ. 8 లక్షల 90 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో అప్లికేషన్ మిస్ అయింది. ఇదే విషయంపై సదరు కంపెనీకి కాల్ చేయగా వారి నుంచి రెస్పాన్స్ లేకపోగా ఆ తర్వాత మొబైల్‌ నెంబర్‌ స్వీచ్ఛాఫ్‌ చేసేశారు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన వెంకటరాజు ములుగు పోలీసులను ఆశ్రయించాడు.

సైబర్‌ క్రైమ్ ను సీరియస్‌గా తీసుకున్న ములుగు పోలీసులు దాదాపు సంవత్సరం పాటు గాలింపు చేపట్టారు. నిందితుడు కర్ణాటక‌లోని కొడుగు జిల్లా, చౌటెల్లి గ్రామానికి చెందిన కేవీ మహేంద్రగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 3,50,000 నగదును రికవరీ చేశామని ఏఎస్పీ పోతురాజు సాయి చైతన్య వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News