రైల్వే ఉద్యోగాల పేరుతో మోసాలు జాగ్రత్త..
దిశ, కంటోన్మెంట్ : రైల్వే శాఖలో ఉద్యోగాలను ఇప్పిస్తామని కొంతమంది మోసగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ సి.హెచ్.రాకేశ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వేలో ఉద్యోగాల కోసం వివిధ నగరాల్లో ఉన్న 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), జోనల్ రైల్వే పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) ద్వారా నోటిఫికేషన్ల ప్రకటనను పత్రికలో జారీ చేసి ఉద్యోగ […]
దిశ, కంటోన్మెంట్ : రైల్వే శాఖలో ఉద్యోగాలను ఇప్పిస్తామని కొంతమంది మోసగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ సి.హెచ్.రాకేశ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వేలో ఉద్యోగాల కోసం వివిధ నగరాల్లో ఉన్న 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), జోనల్ రైల్వే పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) ద్వారా నోటిఫికేషన్ల ప్రకటనను పత్రికలో జారీ చేసి ఉద్యోగ నియామకాలను చేపడుతామని తెలియజేశారు.
భారత రైల్వేలో ఉద్యోగ నియామకాలు నిబంధనల ప్రకారం నిజాయతీ, పారదర్శక పద్ధతిలో నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ మార్గంలో ఎంపికలు జరుగవని తెలిపారు. ఉద్యోగ ఆశావహులు రైల్వేలో ఏదేని ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లు సందర్శించి నియమాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నకిలీ వెబ్‌సైట్లు, మోసగాళ్లను విశ్వసించవద్దని సూచించారు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తప్పుడు వాగ్దానం చేస్తూ డబ్బు కోసం మాయమాటలు చెప్పే వారిని సంప్రదించి ఉద్యోగ ఆశావహులు మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగ నియామకాల సంబంధిత సమాచారం ఆర్‌ఆర్‌బీ/ఆర్‌ఆర్‌సీ/ఎస్‌సీఆర్ వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు ఇవ్వబడుతుందన పేర్కొన్నారు.