మారటోరియంపై విచారణ మళ్లీ వాయిదా

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో రుణగ్రాహీతలకు ఆరు నెల్ల మారటోరియంకు సంబంధించి విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వం, ఆర్‌బీఐలకు వడ్డీలను లెక్కించేందుకు అవసరమైన మార్గదర్శకాలను, నోటిఫికేషన్, సర్క్యులర్ జారీ లాంటి పలు అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. ఈ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు అక్టోబర్‌ 13వ తేదీకి మళ్లీ వాయిదా వేసింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో సమాచారం సమగ్రంగా లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అదనపు […]

Update: 2020-10-05 09:13 GMT
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో రుణగ్రాహీతలకు ఆరు నెల్ల మారటోరియంకు సంబంధించి విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వం, ఆర్‌బీఐలకు వడ్డీలను లెక్కించేందుకు అవసరమైన మార్గదర్శకాలను, నోటిఫికేషన్, సర్క్యులర్ జారీ లాంటి పలు అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది.
ఈ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు అక్టోబర్‌ 13వ తేదీకి మళ్లీ వాయిదా వేసింది. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో సమాచారం సమగ్రంగా లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అదనపు అఫిడవిట్లు దాఖలు చేయడానికి ఆర్‌బీఐ, ప్రభుత్వానికి మరో వారం గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. రియల్ ఎస్టేట్, బిల్డర్లను అఫిడవిట్లో పట్టించుకోలేదని న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్, విద్యుత్ ఉత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించాలని సుప్రీంకోర్టుకు సూచించగా, కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. అలాగే, అన్ని అఫిడవిట్లను అక్టోబర్ 12 నాటికి సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను ఇచ్చింది. ప్రభుత్వం చిన్న స్థాయి రుణ గ్రహీలకు ఆరు నెలల మారటోరియం సమయానికి చక్రవడ్డీనికి మాఫీ చేసేందుకు సిద్ధమైన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకుంది.
ఈ మాఫీ వల్ల ప్రభుత్వానికి రూ. 5000 కోట్ల నుంచి రూ. 7000 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనాలున్నాయి. బ్యాంకులు చక్రవడ్డీని మాఫీ చేసేందుకు క్లెయిమ్ వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం ప్రభుత్వ నగదును ఖాతాలను బదిలీ చేయనుంది. ఇందులో వడ్డీని లెక్కించిన విధానాలను పరిగణలోకి తీసుకుని మాఫీన్ని అందించనుంది.
మార్చి నుంచి ఆగష్టు మధ్య రుణ బకాయిలను చెల్లించిన లబ్దిదారులకు ఇది వర్తిస్తుంది. అలాగే, రూ. 2 కోట్ల లోపు ఉన్న ఎంఎస్ఎంఈ రుణాలు, క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు, స్టడీ లోన్, హౌసింగ్ లోన్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్ తీసుకున్న వారికి ఇది అమలవుతుంది. ‘కరోనా వ్యాప్తి సమయంలో రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోందని కేంద్రం అఫిడవిట్‌లో వివరించింది.
Tags:    

Similar News