సత్తుపల్లికి పిడమర్తి గుడ్ బై..?
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆయనో విద్యార్థి నాయకుడు.. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కీలక కీలక పాత్ర పోషించాడు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా.. గెలవలేకపోయాడు. అంతేకాదు.. ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకోలేకపోయాడు.. ఇప్పుడు తన ప్రత్యర్థి అధికార పార్టీలో చేరడంతో ఆయన పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితే నెలకొంది. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..? ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. 2014, 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆయనో విద్యార్థి నాయకుడు.. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కీలక కీలక పాత్ర పోషించాడు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా.. గెలవలేకపోయాడు. అంతేకాదు.. ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకోలేకపోయాడు.. ఇప్పుడు తన ప్రత్యర్థి అధికార పార్టీలో చేరడంతో ఆయన పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితే నెలకొంది. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..? ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. 2014, 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పోటీచేసే అవకాశం వచ్చినా అధికార పార్టీ నుంచి గెలవలేకపోయాడనే అపవాదు కూడా ఉంది. ఎన్నికల సమయంలో తప్ప నియోజకవర్గంలో కనపడని పిడమర్తి, గులాబీ పార్టీలో సండ్ర చేరికతో ఇక పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక సత్తుపల్లికి ఆయన గుడ్ బై చెప్పినట్లేననే చర్చ జోరుగా నడుస్తోంది.
రెండు సార్లూ..
2014 ఎన్నికల్లో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పిడమర్తి రవికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ ఈయన సామాజిక వర్గానికే చెందిన బలమైన నాయకుడిగా సండ్ర వెంకట వీరయ్య ఉండడంతో గెలవలేకపోయాడు. అప్పటి నుంచి అడపదడపా నియోజకవర్గంలో తిరగడం తప్ప కాడర్ పెంచుకునేందుకు ప్రయత్నించలేదని టీఆర్ఎస్ పార్టీ నేతలే అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో మాత్రం టీడీపీ తరఫున పోటీచేసిన సండ్ర గెలవడం.. ఆయనకు దీటుగా నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోవడం 2018 ఎన్నికల్లో కూడా ప్రభావం చూపింది. అంతేకాదు.. నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జీగా ఉన్నా పట్టు సాధించేందుకు ఏ విధమైన కార్యాచరణ రూపొందించలేదని టీఆర్ఎస్ అభిమానులే చెపుతుంటారు. ఈ క్రమంలోనే 2018లో కూడా మరోసారి పోటీ చేసే అవకాశం వచ్చినా పిడమర్తి ఓటమికి కారణమైంది.
సండ్ర చేరికతో తెగిన బంధం..
పిడమర్తి రవి 2018 ఎన్నికల తర్వాత సత్తుపల్లి నియోజకవర్గానికి దాదాపుగా దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని దాదాపు అన్ని పార్టీల వారూ విమర్శిస్తుంటారు. ఎన్నికల సమయంలో హడావుడి చేయడం తప్ప అధికార పార్టీ తరఫున ఆయన చేసిందేమీ లేదని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. ఇప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జీగా కొనసాగుతున్నప్పటికీ పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కానీ, క్యాడర్ పెంచుకోవడం గానీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య సైతం గులాబీ గూటికి చేరడంతో ఇక పిడమర్తి నియోజకవర్గానికి శాశ్వతంగా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు టీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసేందుకు సండ్ర కీలకంగా వ్యవహరించడంతో అధిష్టానం దృష్టిలో ఆయన మంచి పేరుంది. అంతేకాదు నియోజకవర్గంలో కూడా మంచి పట్టు ఉండడంతో ఇక ఆ స్థానం పూర్తిగా సండ్రదే కానుందని, పిడమర్తి ఇక గుడ్ బై చెప్పినట్లేననే చర్చ నడుస్తోంది.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నా..
ఓటమి తర్వాత పిడమర్తి రవికి కేసీఆర్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అయినా దానినీ ఉపయోగించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందినవారిని కూడా బలమైన క్యాడర్ తయారు చేసుకోలేకపోయారు. అవకాశం ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ పరిమితమైన పిడమర్తి ఇప్పుడు సత్తుపల్లిని మర్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2021లో పోటీ చేసే అవకాశం వచ్చినా కొద్దోగొప్ప పరిచయం ఉన్న నియోజకవర్గం మాత్రం చేజారినట్లే అయింది.