లాక్‌డౌన్‌కు ముందు విక్రయించిన వాహనాలకే రిజిస్ట్రేషన్లు
దిశ, వెబ్‌డెస్క్: బీఎస్-4(BS -4) వాహన రిజిస్ట్రేషన్ల(Vehicle registrations)కు సంబంధించిన అంశంలో అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. పోర్టల్‌లో నమోదు కాని, మార్చి 31 తర్వాత విక్రయించిన వాహన రిజిస్ట్రేషన్లకు అనుమతి నిరాకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. మార్చి 31కి ముందు అమ్మిన, ఈ-పోర్టల్‌లో నమోదైన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. అలాగే, ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)కు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో మార్చి 31కి ముందు వాహనాలను కొని, రిజిస్ట్రేషన్ చేయని వారికి […]
దిశ, వెబ్‌డెస్క్: బీఎస్-4(BS -4) వాహన రిజిస్ట్రేషన్ల(Vehicle registrations)కు సంబంధించిన అంశంలో అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. పోర్టల్‌లో నమోదు కాని, మార్చి 31 తర్వాత విక్రయించిన వాహన రిజిస్ట్రేషన్లకు అనుమతి నిరాకరిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. మార్చి 31కి ముందు అమ్మిన, ఈ-పోర్టల్‌లో నమోదైన వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది.
అలాగే, ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)కు ఈ ఉత్తర్వులు వర్తించవని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో మార్చి 31కి ముందు వాహనాలను కొని, రిజిస్ట్రేషన్ చేయని వారికి ఊరట ఉండనుంది. ఇటీవల బీఎస్-4(BS -4) వాహన రిజిస్ట్రేసహన్లను నిలిపేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ సంక్ష్యలో వాహనాల విక్రయాలు జరిగిన అంశంపై స్పష్టం వచ్చే వరకు రిజిస్ట్రేషన్లను చేయకూడదని అధికారులను ఆదేశించింది.
ఈ అంశంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వాయిదా వేసిన తర్వాత గురువారం విచారణ అనంతరం కొత్త ఆదేశాలను ఇచ్చింది. ప్రస్తుత సంవత్సరం మార్చి నెలలో 12 నుంచి 31వ తేదీ మధ్య కాలంలో 11 లక్షలకు పైగా బీఎస్-4 (BS -4) వాహనాల విక్రయాలు జరిగాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and National Highways) కోర్టుకు నివేదిక (Report) అందజేసింది. ఇందులో 2.9 లక్షల వాహనాలు లాక్‌డౌన్ సమయమ్ళో అమ్మినట్టు, మార్చి 31కి ముందు ఈ-పోర్టల్(E-Portal)లో 39వేల వాహనాలకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదని కోర్టు దృష్టికి రావడంతో ఆ వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వడంలేదని కోర్టు పేర్కొంది.