కొన్ని గంటలపాటు నిలిచిపోనున్న ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ నెల 11, 12వ తేదీల్లో తన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందని, టెక్నాలజీ అప్‌గ్రేడ్ ప్రక్రియలో భాగంగానే ఈ అంతరాయం ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. నిర్ణయించిన రెండు రోజుల్లో  ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవని, ఖాతాదారులకు […]

Update: 2021-12-10 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ నెల 11, 12వ తేదీల్లో తన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందని, టెక్నాలజీ అప్‌గ్రేడ్ ప్రక్రియలో భాగంగానే ఈ అంతరాయం ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

నిర్ణయించిన రెండు రోజుల్లో ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవని, ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత సమర్థవంతంగా అందించడం కోసమే ఈ ప్రక్రియని బ్యాంకు పేర్కొంది. ఈ సమయంలో ఎస్‌బీఐ బ్యాంకింగ్ ఇంటర్నెట్‌తో పాటు యోనో యాప్, యోనో లైట్, యూపీఐ చెల్లింపుల సేవలు, ఐఎంపీఎస్ లాంటి అన్ని రకాల సర్వీసులు నిలిచిపోతాయని బ్యాంకు వివరించింది.

Tags:    

Similar News