జీడీపీ వృద్ధిని మెరుగుపరిచిన ఎస్‌బీఐ ఎకోరాప్!

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీని సవరిస్తున్నట్టు ఎస్‌బీఐ పరిశోధనా విభాగం ఎకోరాప్ నివేదిక వెల్లడించింది. ఇది వరకు అంచనా వేసిన 10.9 శాతం ప్రతికూలతను 7.4 శాతానికి మెరుగుపరిచినట్టు నివేదిక తెలిపింది. పరిశ్రమ , సేవల కార్యకలాపాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సంబంధాల వంటి 41 హై-ఫ్రీక్వెన్సీ సూచికలతో నౌకాస్టింగ్ మోడల్ విధానంలో ఈ అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం..ప్రస్తుత ఆర్థిక […]

Update: 2020-12-16 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీని సవరిస్తున్నట్టు ఎస్‌బీఐ పరిశోధనా విభాగం ఎకోరాప్ నివేదిక వెల్లడించింది. ఇది వరకు అంచనా వేసిన 10.9 శాతం ప్రతికూలతను 7.4 శాతానికి మెరుగుపరిచినట్టు నివేదిక తెలిపింది. పరిశ్రమ , సేవల కార్యకలాపాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సంబంధాల వంటి 41 హై-ఫ్రీక్వెన్సీ సూచికలతో నౌకాస్టింగ్ మోడల్ విధానంలో ఈ అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 0.1 శాతంగా అంచనా వేసింది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో కరోనా వ్యాప్తి తగ్గితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 11 శాతం సానుకూలంగా ఉంటుందని ఎకోరాప్ అంచనా వేసింది. కరోనాకు ముందు నాటి స్థాయికి వృద్ధి రేటు సాధించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి 7 త్రైమాసికాలు పడుతుందని, మొత్తంగా దేశ జీడీపీలో 9 శాతం ఉత్పత్తి నష్టం ఉండొచ్చని నివేదిక పేర్కొంది. వృద్ధి దృక్పథంలో మెరుగుదల ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యయం క్షీణించిందని, ఆదాయం, మూలధన వ్యయం రెండూ తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో క్షీణించాయి. అదేవిధంగా ఆదాయ వ్యయంలో భారీ క్షీణత కనిపించిందని నివేదిక స్పష్టం చేసింది.

Tags:    

Similar News