SBI News : ఎస్‌బీఐ కస్టమర్లకు చార్జీలు.. విత్ డ్రా చేసినా చెల్లించాల్సిందే..!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వివిధ సేవల చార్జీలను సవరిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా, చెక్ బుక్ చార్జీలు, ఆర్థికేతర లావాదేవీలకు సంబంధించి జులై 1 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్టు ఎస్‌బీఐ మంగళవారం తెలిపింది. సాధారణ సేవింగ్స్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్‌టెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వివిధ సేవల చార్జీలను సవరిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా, చెక్ బుక్ చార్జీలు, ఆర్థికేతర లావాదేవీలకు సంబంధించి జులై 1 నుంచి కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్టు ఎస్‌బీఐ మంగళవారం తెలిపింది. సాధారణ సేవింగ్స్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్‌టెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఈ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు వివరించింది.
బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఖాతా ఉన్నవారు నెలలో నాలుగు సార్లు ఉచితంగా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించి డ్రా చేస్తే గనక సేవల చార్జీలను చెల్లించాలి. జులై 1 నుంచి అమలయ్యే కొత్త చార్జీల ప్రకారం.. దీనికి రూ. 15తో పాటు అదనంగా జీఎస్టీ ఉంటుంది. అలాగే, ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్కులు ఉచితంగా బ్యాంకు అందిస్తుంది. ఆపైన 10 చెక్కులు ఉన్న బుక్ కావాలంటే రూ. 40తో పాటు జీఎస్టీ చెల్లించాలి. 25 చెక్కులు ఉన్న బుక్ కావాలంటే రూ. 75తో పాటు జీఎస్టీ. అత్యవసరంగా 10 చెక్కులు ఉన్న బుక్ కావాలంటే రూ. 50తో పాటు జీఎస్టీ కట్టాలి. సీనియర్ సిటిజన్లకు చెక్‌బుక్‌కు సంబంధించి కొత్త సేవల చార్జీలు వర్తించవని బ్యాంకు వెల్లడించింది.