67 శాతం పుంజుకున్న ఎస్‌బీఐ కార్డ్ లాభాలు!

దిశ, వెబ్‌డెస్క్: రిటైల్, కార్పొరేట్ వ్యయాలలో మెరుగైన వృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ కార్డ్ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ నికర లాభాలు 67 శతం పెరిగి రూ. 345 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 206 కోట్ల నికర లాభాలను అందుకున్నట్లు వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 2,695 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ. 2,510 […]

Update: 2021-10-28 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిటైల్, కార్పొరేట్ వ్యయాలలో మెరుగైన వృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ కార్డ్ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ నికర లాభాలు 67 శతం పెరిగి రూ. 345 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 206 కోట్ల నికర లాభాలను అందుకున్నట్లు వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 2,695 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ. 2,510 కోట్లుగా నమోదైంది. ఈ త్రైమాసికంలో ఫీజులు, సేవల ద్వారా ఆదాయం భారీగా ఉండటంతో సంస్థ లాభాలు పుంజుకున్నాయని ఎస్‌బీఐ కార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. అధిక వ్యాపార వాల్యూమ్‌ల కారణంగా మొత్తం నిర్వహణ వ్యయం 25 శాతం పెరిగి రూ.1,393 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. రీటైల్ ఖర్చులు 41 శాతం పెరిగి రూ. 24,863 కోట్ల నుంచి రూ. 35,070 కోట్లకు చేరాయి. కార్పొరేట్ వ్యయాలు రూ. 4,728 కోట్ల నుంచి 80 శాతం పెరిగి రూ. 8.491 కోట్లకు చేరుకున్నాయి. అలాగే, సెప్టెంబర్ చివరి నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)లు 7.46 శాతం నుంచి 3.36 శాతానికి తగ్గిందని ఎస్‌బీఐ కార్డ్ వెల్లడించింది.

Tags:    

Similar News