సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ICUలో చికిత్స

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సీనియర్ నటుడు సత్యజిత్(71) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో ఆయన బెంగళూరులోని బోరింగ్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఇటీవలే ఆయనకు పచ్చకామెర్లు సోకాయి. ఈ క్రమంలోనే సత్యజిత్‌కు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆయనకు బీపీ, మధుమేహం కూడా ఉండడంతో శరీరం చికిత్సకు స్పందించడం లేదని సత్యజిత్ కుమారుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. చికిత్స ఖర్చుల నిమిత్తం ఫిలిం చాంబర్, ప్రభుత్వం తమను […]

Update: 2021-10-04 22:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సీనియర్ నటుడు సత్యజిత్(71) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో ఆయన బెంగళూరులోని బోరింగ్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఇటీవలే ఆయనకు పచ్చకామెర్లు సోకాయి. ఈ క్రమంలోనే సత్యజిత్‌కు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే.. ఆయనకు బీపీ, మధుమేహం కూడా ఉండడంతో శరీరం చికిత్సకు స్పందించడం లేదని సత్యజిత్ కుమారుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. చికిత్స ఖర్చుల నిమిత్తం ఫిలిం చాంబర్, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సత్యజిత్ 650కిపైగా కన్నడ సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతోపాటు నెగటివ్ పాత్రల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News