కూలిన సర్వాయి పాపన్న కోట

దిశ, వెబ్‎డెస్క్ : ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట కుప్ప కూలింది. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఖిలాశాపూర్‎లో పాపన్న కోట గురువారం ఉదయం కూలిపోయింది. దీంతో కోట కింద ఉన్న నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అయినా ఏ ఒక్కరూ కోట నిర్వహణను పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.

Update: 2020-10-15 03:15 GMT

Tags:    

Similar News