సరస్వతి బ్యారేజీ 60 గేట్లు, లక్ష్మీ బ్యారేజీ 77 గేట్లు ఎత్తివేత
దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం సరస్వతీ బ్యారేజీ, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి 507506 క్యూసెక్కుల నీరు రాగా.. బ్యారేజీలోని మొత్తం 66 గేట్లకు గాను 60 గేట్లు ఎత్తి 507506 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తి నీటి మట్టం 119.00 మీటర్లకు గాను.. ప్రస్తుతం 112.44 మీటర్ల లెవెల్లో […]
దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం సరస్వతీ బ్యారేజీ, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం అన్నారం సరస్వతీ బ్యారేజీలోకి 507506 క్యూసెక్కుల నీరు రాగా.. బ్యారేజీలోని మొత్తం 66 గేట్లకు గాను 60 గేట్లు ఎత్తి 507506 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తి నీటి మట్టం 119.00 మీటర్లకు గాను.. ప్రస్తుతం 112.44 మీటర్ల లెవెల్లో నీరు ఉంది.
బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 1.65 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి 8.54.410 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లకు గాను.. 77 గేట్లు ఎత్తి 8.54.410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ పూర్తి నీటి మట్టం 100.00 మీటర్లకుగాను.. ప్రస్తుతం 96.60 మీటర్ల లెవెల్ లో నీరు ఉంది. బ్యారేజీ పూర్తి నీటి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.259 టీఎంసీల నీరు నిల్వ ఉంది.