సంజయ్ ఝాపై కాంగ్రెస్ వేటు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ ఝాపై బుధవారం ఆ పార్టీ వేటు వేసింది. ఓ వార్తాపత్రికలో కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ ఇటీవల ఝా ఒక వ్యాసం రాశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝాను ఆ పదవి నుంచి తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా సంజయ్ ఝాను తొలిగించినట్టు, కాంగ్రెస్ అధ్యక్షులు దాన్ని ఆమోదించినట్టు ఆ పార్టీ ఓ అధికారిక […]
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ ఝాపై బుధవారం ఆ పార్టీ వేటు వేసింది. ఓ వార్తాపత్రికలో కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ ఇటీవల ఝా ఒక వ్యాసం రాశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝాను ఆ పదవి నుంచి తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా సంజయ్ ఝాను తొలిగించినట్టు, కాంగ్రెస్ అధ్యక్షులు దాన్ని ఆమోదించినట్టు ఆ పార్టీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. అభిషేక్ దత్త్, సాధనా భారతీలను పార్టీ జాతీయ మీడియా ప్యానెలిస్టులోకి తీసుకున్నారు.
సంజయ్ ఝా రాసిన వ్యాసంలో కాంగ్రెస్ రాజకీయ వైఖరిని సరిచేసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పార్టీ మళ్లీ పుంజుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదని ఆరోపించారు. ఈ లోపాలను పసిగట్టని వారెందరో పార్టీలో ఉన్నారని తెలిపారు. గాంధీ, నెహ్రూల సిద్ధాంతాలను నమ్ముకున్న తాను, కాంగ్రెస్ ఈస్థాయికి దిగజారడం బాధను కలిగిస్తుందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.