నిశ్శబ్ధ మానసిక ఆరోగ్య సంక్షోభంలో ఉన్నాం : సంజన
దిశ, సినిమా : కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తోంది హీరోయిన్ సంజనా సంఘీ. స్వతహాగా సైకలాజికల్ స్టూడెంట్ అయిన తను.. పాండమిక్ టైమ్లో దీనిపై దృష్టిసారించాల్సిన అవసరముందని వివరిస్తోంది. ఆందోళన, భయం, దు:ఖం లాంటి భావోద్వేగాలతో చాలా రకాలుగా బాధపడుతున్నామని తెలిపింది. కరోనా కారణంగా బంధువులను కోల్పోయిన తనకు మెంటల్ హెల్త్ గురించి ఇనిషియేటివ్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, సైకాలజిస్టులతో ఫ్రీ ఆడియో, టెక్ సెషన్స్ ఏర్పాటు చేస్తామని […]
దిశ, సినిమా : కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తోంది హీరోయిన్ సంజనా సంఘీ. స్వతహాగా సైకలాజికల్ స్టూడెంట్ అయిన తను.. పాండమిక్ టైమ్లో దీనిపై దృష్టిసారించాల్సిన అవసరముందని వివరిస్తోంది. ఆందోళన, భయం, దు:ఖం లాంటి భావోద్వేగాలతో చాలా రకాలుగా బాధపడుతున్నామని తెలిపింది.
కరోనా కారణంగా బంధువులను కోల్పోయిన తనకు మెంటల్ హెల్త్ గురించి ఇనిషియేటివ్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, సైకాలజిస్టులతో ఫ్రీ ఆడియో, టెక్ సెషన్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ ఐడియాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారన్న ఆమె.. అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. నిధుల సేకరణ, అవసరమైన మెటీరియల్స్ పొందేందుకు హెల్ప్ చేయాలని కోరింది. ఇప్పటికే బిగ్ రెస్పాన్స్ వచ్చిందన్న సంజన.. త్వరలో స్లాట్స్ ఓపెన్ అవుతాయని పేర్కొంది.