కరోనా నియంత్రణలో ప్రభుత్వ చర్యలు భేష్
దిశ, మహబూబ్ నగర్ : కరోనా నియంత్రణ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్యెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రపంచంలో రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడంలో ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. అలంపూర్ నియోజక వర్గంతో పాటు రాష్ట్రంలో రైతులు కారోనా వల్ల ఇబ్బందులు పడుతున్నారని మిర్చి, మొక్కజొన్న, శనగ పంటలు […]
దిశ, మహబూబ్ నగర్ : కరోనా నియంత్రణ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్యెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రపంచంలో రోజు రోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడంలో ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. అలంపూర్ నియోజక వర్గంతో పాటు రాష్ట్రంలో రైతులు కారోనా వల్ల ఇబ్బందులు పడుతున్నారని మిర్చి, మొక్కజొన్న, శనగ పంటలు వేల ఎకరాలలో పొలాల్లోనే ఉండిపోయాయని వివరించారు. కోల్డ్ స్టోరేజీలు కూడా పనిచేయడం లేదని, వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Tags: ex mla, sampath kumar, letter, cm kcr, ts news