ఎట్టకేలకు విడాకులపై నోరువిప్పిన సమంత.. అక్కినేని ఫ్యామిలీ గుట్టురట్టు..?

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని సమంత ఎట్టకేలకు రూమర్స్ పై నోరు విప్పింది. గత కొన్నిరోజులుగా ఆమె, భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొంటుందని, హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మారుస్తోందని వార్తలు హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పటికే విడాకులు కూడా జరిగినట్లు చెప్తుండగా.. తాజాగా ఆమె ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. సమంత సొంత దుస్తుల బ్రాండ్‌ ‘సాకి’ ఏర్పాటు చేసి మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా […]

Update: 2021-09-28 22:25 GMT

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని సమంత ఎట్టకేలకు రూమర్స్ పై నోరు విప్పింది. గత కొన్నిరోజులుగా ఆమె, భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకొంటుందని, హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మారుస్తోందని వార్తలు హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పటికే విడాకులు కూడా జరిగినట్లు చెప్తుండగా.. తాజాగా ఆమె ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. సమంత సొంత దుస్తుల బ్రాండ్‌ ‘సాకి’ ఏర్పాటు చేసి మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంత చిన్నపాటి వేడుకలు నిర్వహించింది. అలాగే ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తానని ముందస్తుగానే ఓ పోస్ట్‌ చేసిన సామ్‌.. చెప్పినట్లుగానే అభిమానులు అడిగిన ప్రశ్నకు ఓపికతో బదులిచ్చింది. ఎక్కువగా అభిమానులందరూ సామ్ – చైతో విడిపోతున్నారన్న వార్తలు నిజమేనా అని అడగడం మొదలు పెట్టారు.

ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక విడాకుల నేపథ్యంలోనే ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు భోగట్టా ? సమంత చెన్నైలో ఉంటుందని, చైతు హైదరాబాద్లో ఒంటరిగానే ఉంటున్నట్టు బాగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక అభిమాని “‘మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా.?’ అంటూ ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సామ్ సమాధానం చెప్తూ ” నేను ఎక్కడికి వెళ్లడం లేదు.. హైదరాబాద్ లోనే ఉంటాను.. హైదరాబాద్ నాకు అన్ని ఇచ్చింది.. ఇదే నా ఇల్లు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ పుకార్లు ఎక్కడ, ఎలా మోదలయ్యాయో తనకే తెలియదని, కానీ అవన్నీ కూడా పుకార్లే అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మరి ఈ సెలబ్రేషన్స్ లో అక్కినేని ఫ్యామిలీ లేకపోవడం, చైతూ కూడా తన సక్సెస్ కి శుభాకాంక్షలు చెప్పకపోవడంతో ఇంకా కోడలు పిల్ల ఏదో దాస్తోందని.. ఇంకా అక్కినేని ఫ్యామిలీ గుట్టురట్టు చేయకుండా గోప్యంగా ఉంచుతోందని అభిమానులు గుసగుసడలాడుతున్నారు.

ప్రియాంక‌ చోప్రా విడాకులు.. విచారం వ్యక్తం చేసిన ఆమె త‌ల్లి..!

Tags:    

Similar News