సమంత టీఆర్‌ఎస్‌లో చేరనుందా? కేటీఆర్ ట్వీట్‌కు రిప్లయ్.. ఆంతర్యమేంటి?
దిశ, సినిమా : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. పర్సనల్ లైఫ్ ట్రాజెడీ నుంచి బయటడేందుకు కెరీర్‌పై ఫోకస్ చేసిన సామ్.. వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ బిజీ షెడ్యూల్‌కు షిప్ట్ అవుతోంది. సెల్ఫ్ రెస్పెక్ట్‌కు కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే సామ్.. ఓన్ ఐడెంటిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రీసెంట్ ట్వీట్‌ను ఆమె రీట్వీట్ చేయడం షాక్‌కు గురిచేసింది. బీజేపీ ప్రభుత్వం మూడు […]
దిశ, సినిమా : నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోయింది. పర్సనల్ లైఫ్ ట్రాజెడీ నుంచి బయటడేందుకు కెరీర్‌పై ఫోకస్ చేసిన సామ్.. వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ బిజీ షెడ్యూల్‌కు షిప్ట్ అవుతోంది. సెల్ఫ్ రెస్పెక్ట్‌కు కేరాఫ్ అడ్రస్‌లా కనిపించే సామ్.. ఓన్ ఐడెంటిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రీసెంట్ ట్వీట్‌ను ఆమె రీట్వీట్ చేయడం షాక్‌కు గురిచేసింది.
బీజేపీ ప్రభుత్వం మూడు రైతు చట్టాలపై వెనక్కి తగ్గడం మంచి పరిణామమన్న కేటీఆర్.. రైతులపై మోపిన దేశ ద్రోహం కేసులను కొట్టేయాలని, ఈ ఉద్యమంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వబోతున్న విషయాన్ని తెలియజేస్తూ.. రైతులకు కేసీఆర్ సాయం చేయడం చాలా గర్వకారణమని ట్వీట్ చేశారు.
ఇదే ట్వీట్‌కు సమంత ‘నమస్కారం’ సింబల్‌తో రిప్లయ్ ఇవ్వగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘వాళ్ళను నమ్మకండి మేడమ్’ అని ఒకరు, ‘మా నిరుద్యోగ భృతి గురించి కూడా అడగండి ప్లీజ్’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తున్నవారు.. ఏంటి? సమంత టీఆర్‌ఎస్‌లో చేరి జయలలిత మేడమ్‌లా పొలిటికల్‌గా చక్రం తిప్పాలనుకుంటుందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
సెక్స్ గాడ్‌తో సెక్సీ క్వీన్స్.. జలస్ ఫీల్ అవుతున్నారా?
— Samantha (@Samanthaprabhu2) November 21, 2021